ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం 2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను అమరావతిలో ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రజల రాజధానిగా భావిస్తున్న అమరావతిలో ఈ వేడుకలు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
Read Also: TDP Joining: వైసీపీకీ భారీ షాక్ ఇచ్చిన అనంతపురం మైనార్టీలు

కొండమరాజుపాలెం పరిసరాల్లోని హైకోర్టు రోడ్డుకు ఆనుకుని, మంత్రుల నివాసాల ఎదురుగా ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ పరేడ్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, రంగుల బాణసంచా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర(AP) విభజన అనంతరం ఇప్పటివరకు విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకలకు భిన్నంగా, అమరావతిలో నిర్వహించే ఈ వేడుకలు రాజధాని అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక ఘట్టంగా నిలవనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అమరావతికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: