కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై పోలీసులపై తీవ్ర అసహనం
విజయవాడ : రాష్ట్ర (AP) పోలీసులపై హైకోర్టు (High court)మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో చోరికేసుకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను ఆమలు చేయక పోవడంపై జరిగిన విచారణలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తిరుమల పరకాణి నుంచి 72,000 రూపాయల విలువ చేసే 900 అమెరికా డాలర్లు చోరీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో విచారణ జరిసిన హైకోర్టు తిరుమల వన్ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు రికార్డులను సీజ్ చేయాలని ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలు అమలు కాకపోవడంతో తాజా విచారణలో ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 19న ఆదేశాలు ఇస్తే, ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది.
గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతించిన సుప్రీం కోర్టు

రికార్డుల తారుమారుపై అనుమానం – డీజీకి సీల్డ్ కవర్ ఆదేశం
సాంకేతిక కారణాలను సాకుగాచూపడాన్ని ఉపేక్షి ంచబోమని చెప్పింది. ఇంత జాప్యమెందుకుని నిలదీసింది. డిజిపి నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయనప్పడు పోలీసు శాఖను మూసివేయాలంది. రికార్డులను సీజ్ చేయక పోవడం వల్ల ఇప్పటికే వాటిని తారుమారు చేసి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. గత ఆదేశాలకు అనుగుణంగా రికార్డుల సీజ్, టిటిడి (AP) బోర్డు తీర్మానాలకు సంబంధించిన రికార్డులను కూడా జప్తు చేయాలని సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ను ఆదేశించింది. వీటిని సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టు రిజిస్ట్రార్ ( జ్యూడిషియల్) ద్వారా అందజేయాలని డీజీని ఆదేశించింది. విచారణను ఈ నెల 17కి వాయిదా వేస్తూ జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఆదేశాలిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: