విజయవాడ : తమ ఆదేశాల మేరకు నడుచుకోలేదనే కారణంతో ఓ వ్యక్తిని గుంటూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ (డీసిడీఆర్సీ) జ్యుడీషియల్ రిమాండ్కు పంపి మూడేళ్ళుగా కారాగారంలో నిర్బంధించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇలా చేయడం రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ (Freedom) ను హరించడమేనంది. జైలు శిక్ష విధించే అధికారాన్ని డీసీడీఆర్సీ నిర్లక్ష్యంగా వినియోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ‘పెనాల్టీ పిటీషన్ల’ విచారణ సందర్భంగా తమ ముందు హాజరుకాలేదనే కారణంతో స్థిరాస్థి సంస్థ విజయసారథి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (వీఎస్మెచ్పీఎల్) ఎండీ అల్లాభక్షును జ్యుడీషియల్ రిమాండ్కు (Judicial remand) పంపారని, ఆయనను వెంటనే విడుదల చేయాలని గుంటూరు జిల్లా కారాగార సూపరింటెండెంట్ను ఆదేశించింది.

అప్పగించకపోవడంతో
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందన రావు, జస్టిస్ జె. సుమతితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంకాయలపాడులో వీఎస్పాచ్పీఎల్ ఎండీ అల్లాభక్షు (MD Allahbhakshu) పలువురితో ప్లాట్ల విక్రయానికి ఒప్పందం చేసుకున్నారు. వాటిని అప్పగించకపోవడంతో కొనుగోలు దారులు 2019లో గుంటూరు డీసీడీఆర్సీని ఆశ్రయించారు. కొనుగోలుదారులకు నాలుగు వారాల్లో 12% వడ్డీతో సొమ్ము చెల్లించాలని అల్లాబక్షును కమీషన్ ఆదేశించింది. ఆయన అలా చేయలేదని కొనుగోలుదారులు 2022లో పెనాల్టీ పిటీషన్లు దాఖలు చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఉంది. ఈ హైకోర్టులో గరిష్ఠంగా 37 మంది న్యాయమూర్తులు ఉండవచ్చు. వీరిలో 28 మంది స్థాయీ న్యాయమూర్తులుగా, 9 మంది అదనపు న్యాయమూర్తులుగా నియమించవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 29 మంది న్యాయమూర్తులు ఉన్నారు.
హైకోర్టు న్యాయమూర్తులకు అత్యధికంగా ఎంత జీతం ఉంటుంది?
భారతదేశంలో 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం, హైకోర్టుల ముఖ్య న్యాయమూర్తులకు నెల జీతంగా ₹2,50,000, ఇతర న్యాయమూర్తులకు ₹2,25,000 వరకు జీతం లభిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: AP Government: రెవెన్యూ మాన్యువల్ సిద్ధం చేసిన ప్రభుత్వం