ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యోగుల వైద్య బిల్లుల చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు వరకు ఉన్న అన్ని మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో దినేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే సులభంగా చేసుకోవచ్చు.
Read also: AP: ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్.. ఒకరి మృతి
పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు
ఉద్యోగులతో సమావేశంలో.. ఉద్యోగుల వైద్య బిల్లులు, హెల్త్ కార్డులు, నెట్‌వర్కింగ్ ఆస్పత్రుల్లో చికిత్సలపై దినేష్ కుమార్ చర్చించారు. ప్రభుత్వం ఉద్యోగుల వైద్య బిల్లులను వీలైనంత త్వరగా పరిష్కరించి.. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడానికి చర్యలు తీసుకుంటోందన్నారు.14 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులను ఆగస్టు నాటికి పూర్తిగా క్లియర్ చేశామని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీఈవో దినేష్ కుమార్ తెలిపారు.ఈహెచ్‌ఎస్‌కు సంబంధించిన మొత్తం సమాచారం, మెడికల్ బిల్లుల తాజా పరిస్థితిని ఇకపై వాట్సప్ ద్వారా ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు పంపిస్తామన్నారు.

అలాగే ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈహెచ్‌ఎస్ ఆరోగ్య కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ఉద్యోగులకు ఇప్పుడు ఆన్‌లైన్ సౌకర్యం కల్పించారు. దీనివల్ల ఉద్యోగులు తమ ఆరోగ్య కార్డులకు సంబంధించిన వివరాలను ఎప్పుడైనా, ఎక్కడైనా మార్చుకునే వీలుంటుంది. ఇది ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొత్తం మీద బిల్లులు చెల్లించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: