రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. (AP) అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, చికిత్స సమయంలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుంటి వెంకటేశ్వర ప్రసాద్ రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ (Congress) పార్టీతో ప్రారంభించారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, పనిచేశారు. అనంతరం 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు.

Read Also: Vijayawada: దుర్గగుడిలో రికార్డు స్థాయిలో తలనీలాల ధర
మృతి పట్ల పలువురు సంతాపం
ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. (AP) ఆయన సేవలను కొనియాడుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచారం వ్యక్తం చేస్తున్నారు. గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మృతితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: