నెల్లూరు జిల్లాలో(AP) ఉద్యోగుల రాష్ట్ర బీమా (ESI) వైద్య సేవలను విస్తరించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది. లోక్‌సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, సహాయ మంత్రి శోభా కరండ్లాజే ఈ రెండు ఆసుపత్రులపై వివరాలు వెల్లడించారు.
Read Also: Chandrababu: సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్: సిఎం చంద్రబాబు

శ్రీ సిటీలో ప్రతిపాదిత 100 పడకల ESI ఆసుపత్రి కోసం అవసరమైన ఐదు ఎకరాల స్థలాన్ని సిబ్బంది క్వార్టర్లతో సహా ఇప్పటికే సేకరించారని, దీనిని ESIC జూన్ 27, 2025న జరిగిన 196వ సమావేశంలో ఆమోదించినట్టు తెలిపారు.
రెండవ ESI ఆసుపత్రి నిర్మాణం త్వరలో ప్రారంభం
నెల్లూరు నగరంలో ప్రణాళిక చేసిన(AP) రెండవ ఆసుపత్రి నిర్మాణానికి ESIC తమకు చెందిన రెండు ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు కరండ్లాజే తెలిపారు. అలాగే, సిబ్బంది క్వార్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక ఎకరాన్ని గుర్తించింది. ప్రస్తుతం ఈ స్థలం ఆసుపత్రి నిర్మాణానికి అనుకూలమా లేదా, టెండర్ ప్రక్రియ వంటి అంశాలు ESIC స్థాయిలో పరిశీలనలో ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: