AP Govt: రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ‘ఛాయ్ రస్తా’ పథకం కింద టీ దుకాణాల ఏర్పాటు చేపడుతోంది. ఈ కార్యక్రమాన్ని మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల(DWCRA Women)కు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
Read Also: AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్
ఈ పథకాన్ని కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఇప్పటికే ఒక టీ దుకాణం ప్రారంభమై ఉండగా, మరో నాలుగు కేంద్రాల్లో కూడా త్వరలో ఏర్పాటు చేయడానికి చర్యలు జరుగుతున్నాయి. బ్యాంకు రుణాల సాయంతో మహిళలకు ఆర్థిక సహాయం అందించి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే ఈ పథకం లక్ష్యం.
‘ఛాయ్ రస్తా’ పథకం ద్వారా మహిళలు స్థిరమైన ఆదాయం పొందడంతో పాటు స్వంత వ్యాపార నిర్వహణలో అనుభవం సొంతం చేసుకోనున్నారు. ప్రతి దుకాణానికి అవసరమైన ప్రాథమిక వసతులు, శిక్షణ, రుణ సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది. ఈ పథకం(‘Chai Rasta’ scheme) విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని నియోజకవర్గాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా డ్వాక్రా మహిళలు ఉద్యోగాల మీద ఆధారపడకుండా, స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: