భారత హర్డిల్ క్వీన్, తెలుగు తేజం జ్యోతి యర్రాజీ (Jyothi Yarraji) పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. ఆమె 100 మీటర్ల హార్డిల్స్ లో 12.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సరికొత్త రికార్డు సృష్టించారు. వర్షం కారణంగా ప్రేక్షకులు లేకపోవడంతో ఆమె విజయం ఒంటరిగా నిలిచిందనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో, ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, జ్యోతి యర్రాజీకి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఒలింపిక్స్ లో పతకం సాధించే వరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Read Also: Vijay Hazare Trophy 2025: ప్రారంభమైన విజయ్ హజారే ట్రోఫీ

విశాఖపట్టణానికి చెందిన 25 ఏళ్ల జ్యోతి యర్రాజీ నిరుపేద కుటుంబం నుంచి స్టార్ అథ్లెట్‌గా ఎదిగింది. జ్యోతి యర్రాజి (Jyothi Yarraji) తండ్రి సూర్యనారాయణ స్థానికంగా సెక్యూరిటీ గార్డు. తల్లి కుమారి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తోన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ సహకారంతో జ్యోతి యర్రాజీ అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది. ఆమెకు సంబంధించిన ట్రైనింగ్, న్యూట్రిషన్ రిలయన్స్ ఫౌండేషన్ చూసుకుంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: