విజయవాడ : రాష్ట్రంలోని అన్ని చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం కార్డుదారులకు ఇప్పుడిస్తున్న రైస్, పంచదారతో పాటు జనవరి 1 నుంచి రాగులు, (Finger millet) గోధుమ పిండి కూడా అందించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ రెండు సరకులను నవంబరు నుంచే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇస్తున్నామని, జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందించేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అంగీకరించారని చెప్పారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో ప్రస్తుతం ఎఫ్సిఐకు కేవలం 7 కోట్ల 87 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ సామర్థ్యo మాత్రమే ఉందని మనోహర్ అన్నారు.
Read also: Indigo Flight Disruptions : రామ్మోహన్ వల్ల దేశం పరువు పోయింది – పేర్ని నాని

AP Government
గుంటూరు జిల్లాల్లో ధాన్యం ఉత్పత్తి అధికంగా ఉండటంతో
అదనంగా 3 లక్షల 87 వేల (3.87 లక్షల) మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉన్న విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న డిల్లీలో కలిసిన సందర్భంగా.. దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, పిపిపి మోడ్లో సైలోస్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ప్రకటించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ధాన్యం ఉత్పత్తి అధికంగా ఉండటంతో, వీలైనంత త్వరలో పిపిపి మోడ్ లో ఆధునిక సైలోస్ ఏర్పాటు చేసేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో తరచూ ఎదురయ్యే నిర్విరామ వర్షాలతో రైతులు పడుతున్న ఇబ్బందులు చర్చలో వచ్చినప్పుడు, డ్రైయర్లు, రైస్ మిల్స్, సమగ్ర నిల్వ సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ రూపంలో సైలోస్ ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయి సహకారం అందిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: