ఆంధ్రప్రదేశ్(AP)లో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులను ఇప్పటికీ పాతకాలంలో నిర్ణయించిన పోస్టుల పేర్లతోనే పిలుస్తున్నారు. కాలానుగుణంగా మార్పులు రాకపోవడంతో ప్యూన్, వాచ్‌మెన్, అటెండర్, స్కావెంజర్ వంటి కొన్ని పద్దుల పేర్లు ప్రస్తుతం అభ్యంతరకరంగా, గౌరవభంగానికి గురిచేసేవిగా భావించబడుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పలువురు ఉద్యోగులు పనిచేస్తున్న విభాగాల్లో ఇలాంటి పేర్లు వాడటం, పిలవడం కూడా అసౌకర్యం కలిగిస్తోందని అధికారులు గుర్తించారు. సామాజిక మార్పులు, రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి గౌరవవంతమైన జీవన హక్కు, అలాగే గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుంటూ, అభ్యంతరకరమైన ఈ పోస్టుల పేర్లను మార్చాలని సర్కార్ నిర్ణయించింది.
Read Also: CM Chandrababu: రెండేళ్లలో అమరావతిలో వేంకటేశ్వర ఆలయం పూర్తి: సీఎం

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా, వెంటనే చర్యలు తీసుకునేలా సీఎస్ విజయానంద్‌ను దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు తమ పరిధిలో ఉన్న పోస్టుల పేర్లను పరిశీలించి, కొత్త పేర్లకు సూచనలు ఇవ్వాలని ఆదేశించాయి.
కొత్త పేర్లకు ఆమోదం
సాధారణ పరిపాలన శాఖ ఇప్పటికే సుమారు 20 శాఖల్లో పేర్లు మార్చాల్సిన జాబితాను సిద్ధం చేసింది. ఇందులో పోలీసు(police), వైద్యారోగ్యం(medical health), జీఏడీ(GAD) వంటి శాఖల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఈ పేర్ల మార్పు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.
జీవోలో పేర్కొనబడని ఇతర అభ్యంతరకర పద్దులను కూడా ఒక వారం లోగా నివేదిక రూపంలో పంపాలని సీఎస్ ఆదేశించారు. మూడు వారాల్లో మొత్తం పరిశీలన పూర్తి చేసి, కొత్త పేర్లకు ఆమోదం తెలుపుతూ తాజా జీవో విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మార్పులు ప్రభుత్వ విభాగాలతో పాటు కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలలోని పద్దులపైనా అమల్లోకి రానున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: