ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు గత ఏడాదిన్నరగా ఎదుర్కొంటున్న హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం, హెల్త్ కార్డులపైనా, ఉద్యోగుల ఆరోగ్య పథకాలపైనా తలెత్తుతున్న ఇబ్బందులను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వం అధికారికంగా కమిటీ ఏర్పాటు చేస్తూ ఇవాళ జీఓ విడుదల చేసింది. అక్టోబర్ 18న సీఎంతో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాలు హెల్త్ కార్డుల సమస్యలను ప్రస్తావించగా, వాటిని అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటిని నియమించింది.
Read also: Chintamohan: నెహ్రూ పై మోడీ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి

Good news for AP employees and pensioners
ఈ కమిటీ ఎనిమిది వారాల్లోగా
ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేతృత్వంలో పనిచేయనున్న ఈ కమిటీ ఎనిమిది వారాల్లోగా అన్ని సమస్యలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారని జీఓలో పేర్కొంది. ఈ కమిటీలో సీఎస్ తో పాటు సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ప్రధాన కార్యదర్శి/కార్యదర్శి, ఆర్థికశాఖలో హెచ్‌ఆర్ వ్యవహారాల బాధ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఏపీ ఎన్జీవో సమాఖ్య అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో సభ్యులుగా ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: