గర్భిణీ స్త్రీలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం(AP Government) కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా గర్భధారణ నుంచి ప్రసవం వరకు మహిళలకు ఆర్థిక తోడ్పాటు, పోషకాహారం అందిస్తూ వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Read also: Minister Kollu Ravindra: గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు
ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (PMMVY) పథకం కింద, తొలిసారి తల్లి కాబోయే మహిళలకు రూ. 5,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా, రెండోసారి ఆడ శిశువు జన్మిస్తే మరో రూ. 1,000 అదనంగా మంజూరు చేసి మొత్తం రూ. 6,000 నగదు సహాయం అందించనున్నారు.

మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ
ఈ నిధులు దశల వారీగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి. ప్రసవానికి ముందు, తరువాత అవసరమైన వైద్య ఖర్చులు, పోషక ఆహార అవసరాలను తీర్చుకునేందుకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్ చెకప్‌లు, పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ పథకం అమలుతో మాతృమరణాలు తగ్గించడమే కాకుండా, శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, బాలికల జననాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ పథకం వల్ల మరింత లాభం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: