ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి వైద్య సేవలు పూర్తిగా అందుబాటులో ఉండేలా యూనివర్సల్ హెల్త్ పాలసీని (Health policy) అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి సహా చాలా కుటుంబాలకు ఆర్థిక భారంలేకుండా చికిత్స లభించేలా నిబంధనలను మార్చి టెండర్లు జారీ చేసింది. ప్రత్యేకంగా దారిద్ర రేఖ కింద ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి 2.50 లక్షల వరకు బీమా వర్తించగా, అవసరాన్ని బట్టి 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ద్వారా అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Read also: TTD: జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

Free universal health policy in AP
రూ. 25 లక్షల ఉచిత వైద్య సేవలు..
ఏపీఎల్ కుటుంబాలు కూడా 2.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని పొందగలవు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో ఉన్న నిబంధిత వ్యాధుల చికిత్స ఖర్చులను మొదట బీమా సంస్థ చూసి, తర్వాత ట్రస్ట్ ఆ మొత్తం తిరిగి చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. ఈ పథకం ద్వారా ఈహెచ్‌ఎస్, జర్నలిస్ట్ స్కీమ్‌లను మినహాయించి మిగతా మొత్తం 1.63 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేసింది.
2.50 లక్షల ఇన్సూరెన్స్
• రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు
• పేదలకు 2.50 లక్షల బీమా + అవసరానికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం
• ఏపీఎల్ కుటుంబాలకు కూడా 2.50 లక్షల ఇన్సూరెన్స్
• బీమా క్లెయిమ్ అధికమైతే ట్రస్ట్–కంపెనీలు కలిసి ఖర్చు భారం
• మొత్తం 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: