విజయవాడ: ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల శాఖ దుకాణాల (రేషన్ షాపుల) ద్వారా ఇకపై తృణధాన్యాలను (మిల్లెట్స్) ఉచితంగా అందించనుంది. ప్రజల ఆరోగ్యం, మారుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకుని, పేద ప్రజలకు పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగానే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో కూడా రేషన్ కార్డుదారులకు రాగులు మరియు రాగి పిండిని ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం రేషన్ సరుకుల్లో తృణధాన్యాలను అందించాలని నిర్ణయించింది.
Read Also: AP: అర్బన్ ప్రాంతాల సదుపాయాలతో 359 రూర్బన్ పంచాయతీలు!

బియ్యానికి బదులుగా చిరుధాన్యాల పంపిణీ: జొన్నలతో ప్రారంభం
ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి మనిషికి ఐదు కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ రేషన్‌లో కొంతమేర బియ్యానికి బదులుగా గరిష్ఠంగా మూడు కేజీల వరకు రాగులు లేదా జొన్నలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, ప్రతి నెలా 20 కేజీల రేషన్ బియ్యం తీసుకునే కుటుంబం, ఇప్పుడు రెండు కేజీల రాగులు మాత్రమే కావాలనుకుంటే, ఆ మేరకు బియ్యాన్ని మినహాయించుకుని మిగిలిన 18 కేజీల బియ్యాన్ని, రెండు కేజీల రాగులను అందిస్తారు.
ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జొన్నల పంపిణీని ప్రారంభించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా ఎఫ్‌సీఐ ద్వారా పీడీఎస్ అవసరాలకు సరిపడా రాగులు, జొన్నలను కేటాయించేది. ఇప్పుడు కేంద్రం కేటాయించకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వమే టెండరు ప్రక్రియ ద్వారా వాటిని సేకరించి, ఉచితంగా సరఫరా చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: