ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) , కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకాన్ని రాష్ట్రంలో పునఃప్రారంభించింది. ఈ పథకం కింద, పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారు. ఈనేపథ్యంలో ఉచితంగా సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం, బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరించనున్నాయి. అలాగే మొదటి సిలిండర్ ఉచితం, ఆ తర్వాత రూ.300 రాయితీ లభిస్తుంది. దీనివల్ల సామాన్యులకు గ్యాస్ వాడకం మరింత అందుబాటులోకి వస్తుంది.
Read Also: Tirumala: కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?
ఈ పథకం కింద, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద మహిళలకు 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు.. దీనివల్ల ఎంతోమంది మహిళలకు వంటగ్యాస్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. (AP) రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి, ప్రతి జిల్లాలో ‘జిల్లా ఉజ్వల కమిటీ’ని నియమించారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉంటారు.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి జిల్లా కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. ఈ కమిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది. రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారికి, వారి ఇంట్లో ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా ఇవ్వాలి.వలస కార్మికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వారు కూడా అవసరమైన పత్రాలు సమర్పించి గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు.
అయితే, నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ఆదాయ ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. అర్హులైన పేద మహిళలు దగ్గరలోని ఏజెన్సీల వద్దకు వెళ్లి, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద 14.2 కిలోల ఒక సింగిల్ సిలిండర్ లేదా 5 కిలోల రెండు సిలిండర్లు పొందవచ్చు. అర్హులైన ప్రతి మహిళా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: