మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి
విజయవాడ : ఐ.ఏ.ఎస్ కావాలన్న పేద విద్యార్థుల కలను సాకారం చేసేందుకే అంబేద్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్ ఉచిత శిక్షణనిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు విజయవాడ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ ఉచిత శిక్షణను మంత్రి డా. స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను నిర్వీర్యం చేసింది. ఐ.ఏ.ఎస్ కావాలన్న పేద విద్యార్థుల కలను సాకారం చేసేందుకే అంబేద్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్ ఉచిత శిక్షణనిస్తున్నాం. రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో 340 మందికి సివిల్స్ ఉచిత శిక్షణనిస్తున్నాం. శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్స్ పాటు భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తున్నాం.
Read also: AP: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

ree coaching for Civil Services
పేద విద్యార్ధుల్ని పెద్ద మెత్తంలో ఐఏఏస్ చేయాలని
ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదని పేద విద్యార్థుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల చేయూతనిస్తోంది. సివిల్స్ కోచింగ్ అభ్యర్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం. డా. బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా పేద విద్యార్ధుల్ని పెద్ద మెత్తంలో ఐఏఏస్ చేయాలని తెలిపారు. ఈ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. విశాఖ కేంద్రంగా రాష్ట్రంలోని అభ్యర్థులందరికీ సివిల్స్ ఉచిత శిక్షణిచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కార్యక్రమంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఐ.ఏ.యస్ వి. ప్రసన్న వెంకటేష్, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ ఐ.ఏ.యస్ బి. లావణ్యవేణి, ఐ.ఏ.యస్ సదా భార్గవి తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: