ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సహజ సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలతో సమృద్ధిగా ఉన్న ఏపీ, ని దేశీ-విదేశీ పర్యాటకులను ఆకర్షణీయంగా మార్చే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలు ప్రముఖ హోటల్స్ పెట్టుబడులకు ముందుకొచ్చాయి. వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), మంత్రులు కలిసి ఒకేసారి పది కొత్త హోటళ్లకు శంకుస్థాపన చేయనున్నారు.
Read Also: AP tourism news : విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్.. ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం…
ఇప్పటికే మూడు హోటళ్లు ప్రారంభమయ్యాయి
2024-29 పర్యాటక విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ ఈ విషయాన్ని కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. పర్యాటక రంగానికి సంబంధించి కొత్త విధానం ప్రకటించిన తర్వాత ఏడాది లోపే 27 కొత్త హోటళ్లకు అనుమతులు లభించాయన్నారు. ఇప్పటికే మూడు హోటళ్లు ప్రారంభమయ్యాయన్నారు.. పర్యాటకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు నిర్మించాలని భావిస్తున్నారు.

ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో హోటల్స్ నిర్మించేందుకు అవసరమైన స్థలాలను కలెక్టర్లు గుర్తించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న ఖాళీ స్థలాలను సేకరించి సిద్ధం చేయాలన్నారు. ఈ స్థలాల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టి, హోటళ్ల నిర్మాణంపై అనుభవం ఉన్న సంస్థలకు కేటాయిస్తారన్నారు. విశాఖపట్నం, బాపట్ల, సూర్యలంక, తిరుపతి వంటి చోట్ల హోటళ్లు నిర్మించడానికి పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి హోంస్టే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కోసం ఒక పోర్టల్ కూడా అందుబాటులో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: