ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతుల ఆదాయాన్ని పెంచడం, సాగు వ్యవస్థను లాభసాటిగా మార్చడం అనే లక్ష్యంతో మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. రైతన్నా మీకోసం పేరుతో ఈ నెల 24వ తేదీ నుంచి వారంపాటు ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనుందని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదాతల ఇళ్లకు వెళ్తారు.
Read Also: AP Weather Update: అల్పపీడనం.. అతి భారీ వర్షాలు!

మద్దతుపై అవగాహన
పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై అవగాహన కల్పిస్తారు. అలాగే DEC 3న RSKల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహిస్తారు.మార్కెట్ లో, ఏ పంటలకు ధరలు మెరుగ్గా ఉన్నాయో, దానిని అనుసరించి రైతులు సాగు పద్ధతులను మార్చుకుంటే లాభాలు అధికమవుతాయని అధికారులు సూచించనున్నారు.ప్రస్తుత కాలంలో డిమాండ్ ఉన్న పంటలు, నష్టాలపట్ల రక్షణ కలిగించే వ్యవసాయ పద్ధతులు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అవకాశాలపై చర్చిస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: