AP మత్స్యకారుల సంక్షోమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి, వారి ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం ఇస్తున్న చేయూతను ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.
Read Also: Raju weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ

మత్స్యకారుల ఆర్థిక భృతి పెంపు
వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం 20వేల రూపాయల భృతిని అందిస్తోందని గుర్తు చేసిన అచ్చెన్నాయుడు గత ప్రభుత్వం పదివేల రూపాయల భృతిని ఇస్తే, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం 20వేల రూపాయలను ఇస్తుందని, ఈ మొత్తం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దీని ద్వారా ఒక లక్ష 29వేల 178 మత్స్యకార కుటుంబాలకు 259 కోట్ల ఆర్థిక చేకూరినట్లు ఆయన తెలిపారు. వేట (hunting) నిషేధ కాలంలో ఆర్థిక సాయం మాత్రమే కాకుండా వలస వెళ్లే మత్స్యకారులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: