ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం జిల్లాలు, మండలాల పునర్విభజనపై తుది నిర్ణయానికి వచ్చింది. తొలుత 29 జిల్లాలుగా ప్రతిపాదించినప్పటికీ, తాజా నిర్ణయంతో జిల్లాల సంఖ్యను 28కి పరిమితం చేయనున్నారు. ఈ అంశంపై ఈరోజు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఆమోదం పొందనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Read Also: AP: గిరిజన రైతులకు 90శాతం రాయితీతో పరికరాలు

ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన మదనపల్లె జిల్లాను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం లేదు. బదులుగా అన్నమయ్య జిల్లా పేరునే కొనసాగిస్తూ, ఆ జిల్లాకు(AP) మదనపల్లెను కేంద్రంగా నిర్ణయించారు. ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా, ఇకపై మదనపల్లె కేంద్రంగా పనిచేయనుంది. రాయచోటి కూడా అన్నమయ్య జిల్లాలోనే కొనసాగుతుంది.
జిల్లా సరిహద్దులు, భౌగోళిక మార్పులు
జిల్లా పునర్విభజనలో భాగంగా కొన్ని కీలక భౌగోళిక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
- రాజంపేటను కడప జిల్లాలోకి
- రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి
విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మిగిలిన ప్రాంతాలు అన్నమయ్య జిల్లాలో కొనసాగనున్నాయి.
మండలాల పునర్విభజనలో భాగంగా:
- గూడూరు డివిజన్‌లోని వాకాడు, చిట్టమూరు మండలాలు తిరుపతి జిల్లాలోనే కొనసాగనున్నాయి.
- అదే డివిజన్‌లోని గూడూరు, కోట, చిల్లకూరు మండలాలు తిరిగి నెల్లూరు జిల్లాలోకి వెళ్లనున్నాయి.
- అలాగే తిరుపతి జిల్లాలో ఉన్న కలువాయు, రాపూరు, సైదాపురం మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని నిర్ణయించారు.
మార్కాపురం, పోలవరం జిల్లాలపై నిర్ణయం
కొత్తగా ఏర్పాటు కానున్న మార్కాపురం జిల్లాలో పొదిలిని కొనసాగించనున్నారు. అలాగే కురిచేడు, దొనకొండ మండలాలు ప్రకాశం జిల్లాలోనే ఉండనున్నాయి. పోలవరం జిల్లా కూర్పులో ఎలాంటి మార్పులు చేయడం లేదు.
ఈ పునర్విభజనకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మంత్రివర్గ ఆమోదం లభించిన వెంటనే జిల్లాలు, మండలాల మార్పులపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్‌లు విడుదల చేయనున్నారు. ఒకవేళ సమావేశంలో సీఎం మార్పులు సూచిస్తే, అవసరమైన సవరణలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: