ఎపి ఎన్ జి ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని(AP) నాలుగో తరగతి ఉద్యోగుల ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని.. వారిపై పనిభారం తగ్గించాలని ఏపీ ఎన్జీజీవో అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ విజప్తి చేశారు. ఆదివారం ఆల్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని గాంధీనగర్ ఏపీ ఎన్జీవో హోమ్లో జరిగింది. కార్యక్రమానికి ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎన్జీజీవో అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటూ చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. వారికి న్యాయంగా దక్కాల్సిన పదోన్నతులు, వేతన సవరణలపైనా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.
Read also: కేరళ నటీ అత్యాచార కేసు దిలీప్‌కు విముక్తి, కీలక నిందితులకు శిక్ష

నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నికలు
ఈ కార్యక్రమంలో(AP) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి.ఎస్. సాయిరాం, అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ తదితరులు ప్రసంగించారు. ఇక ఆల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుగా వి.ఎస్. సాయిరాం (ఎన్టీఆర్), అధ్యక్షుడుగా ఎన్. చంద్రశేఖర్ (విశాఖ), సహాధ్యకుడుగా వి. శ్రీనివాసరావు (విజయనగరం), ఉపాధ్యక్షులుగా సిహెచ్. వీర వెంకయ్య (ఏలూరు), జి.శ్రీనివాసరావు (అనకాపల్లి), జి. నాగేశ్వరరావు (నెల్లూరు), కె. బాబూరావు (మన్యం), కార్యనిర్వాహక కార్యదర్శిగా పి. బాలరాజు (కృష్ణా), ప్రచార కార్యదర్శిగా జి.గౌరి నాయుడు (పార్వతీపురం), సంయుక్త కార్యదర్సులుగా కె.శ్రీనివాసరావు (గుంటూరు), ఎం. బాలస్వామి (కర్నూలు) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డిఎస్ఎన్ రెడ్డి ప్రకటించారు సహాయ ఎన్నికల అధికారిగా డి. రమేష్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎపి ఎన్జఓ రాష్ట్ర ప్రచార కార్యదర్శి జానకి, ఎన్టిఆర్ జిల్లా సహధ్యక్షులు వివి ప్రసాద్, కోశాధికారి బి. సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు జి. రామకృష్ణ, వివిధ జిల్లాల నాల్గవతరగతి ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: