వీరపునాయునిపల్లె : వీరపునాయుని పల్లెలోని డిగ్రీ కళాశాల నందు ఉల్లి రైతుల నష్టపరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సవితమ్మ హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ హాజరయ్యారు కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి హాజరయ్యారు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉల్లి రైతులు తీవ్రమైన నష్టం రావడంతో ప్రభుత్వము ఎకరాకు 20000 చొప్పున నష్టపరిహారాన్ని అందించిందని ఆయన తెలిపారు. పక్కనే సర్వరాయ సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ రైతులకు సాగు నీరు అందించేందుకు పంట కాలువల లేవని ఈ విషయమై ముఖ్య మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే వంట కాలువలను త్రవ్వించి సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు
Read also: Airports : ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

The coalition government stands in support of the farmers
ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ ఉల్లి రైతులు పంట చేతికొచ్చే సమయానికి సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోవడం తన దృష్టికి వచ్చిన వెంటనే ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కర్నూలు రైతులకే కాదు కడప రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని తెలపడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (chandrababu naidu) నష్టపరిహారం పంపిణీ చేశారని ఆయన తెలిపారు అదేవిధంగా గత ఐదు సంవత్స రాలలో అభివృదిచేసి చూపించామని ఆయన తెలిపారు. త్వరలోనే సర్వరాయ సాగర్ నుంచి సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు భూపేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు జిల్లాలో ఉల్లి రైతులకు నష్టవరిహారాన్ని అందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ ఉల్లి రైతులకు సరైన ధర లేక తీవ్రంగా నష్టపోయారని తన దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్లి జిల్లా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రైతులు కూడా పంట పండించడంమే కాదు దానిని సరైన మార్కెట్ ధరకు అమ్ముకునే విధంగా ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు అదే విధంగా మార్కెట్లో ఏ పంట కైతే గిట్టుబాటు ధర ఉంటుందో అలాంటి వైసిపి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఎవరి ప్రమేయమున్నా జగన్ సహా వదిలిపెట్టబోమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కడప జిల్లా ఇన్చార్జి మంత్రిసవిత అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: