ఏలూరు: ఇటీవల అమెరికా విధిస్తున్న భారీ సుంకాల ప్రభావంపై అంచనా వేసేందుకు పారిశ్రామిక వేత్తలు, వివిధ ఆర్థిక సంస్థలతో చర్చిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ తెలిపారు. భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రి ఇచ్చిన వివరాల ప్రకారం, భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతుల పరిమాణం 2023 ఏప్రిల్ నవంబర్ 278.80 బిలియన్ డాలర్లు ఉండగా ఇదే కాలానికి 2024లో 284.60 బిలియన్ డాలర్లుగా, 2025 ఏప్రిల్ నవంబర్ 292.07 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంటే స్వల్పంగా వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది.

AP
30.213 కోట్ల విలువైన ఎగుమతులు
ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రత్యేకంగా ప్రశ్నించగా.. భారతదేశం నుంచి గత ఏడాది ఏప్రిల్ నవంబర్లో 4.95 బిలియన్ డాలర్ల విలువైన ఆక్వా ఉత్పత్తిల ఎగుమతి జరగగా 2025 ఏప్రిల్ నవంబర్ మధ్య 5.75 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగినట్లు మంత్రి తెలిపారు. ఆక్వా ఎగుమతుల పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ స్వల్పంగా వృద్ధి నమోదవ్వటం విశేషం. పదేళ్ల కిందటితో పోల్చితే భారతీయ ఆక్వా ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. 2013 14 ఏడాదిలో 30.213 కోట్ల విలువైన ఎగుమతులు జరగగా, 2024 25లో 62,408 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.
100శాతం క్రెడిట్ గ్యారెంటీ సౌకర్యం
ఆంధ్రప్రదేశ్ నుంచి 2023-24 ఏడాదిలో మొత్తంగా 19,759.86 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరగగా 2024-25 ఏడాదికి 20,782,81 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఎగుమతి దారులను ప్రోత్సహించేందుకు క్రెడిట్ గ్యారెంటీ పథకం, నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ కంపెనీ లిమిటెడ్ (ఎన్సిజిటిసి) ద్వారా 100శాతం క్రెడిట్ గ్యారెంటీ సౌకర్యం కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం భారతీయ ఎగుమతిదారు ల ప్రపంచ పోటీ తత్వాన్ని పెంచుతుందని, కొత్తగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు.
భారతీయ ఎగుమతులను 1 ట్రిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలనే లక్ష్యం దిశగా వివిధ దేశాలతో, వాణిజ్య కూటములతో 15 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు మరియు 6 ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలపై భారత్ సంతకం చేసినట్టు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అమెరికా సుంకాల పెంపు చర్యల యొక్క పరిమాణ ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. అమెరికా సుంకాల ప్రభావం ముఖ్యంగా ఆక్వా పరిశ్రమపై ఏ విధంగా ఉందంటూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ గతంలో మత్స్య సంపద ఎగుమతులు అమెరికాకు అధిక స్థాయిలో ఉండగా సుంకాల ప్రభావంతో యూరోపియన్ దేశాలు, రష్యాకు ఎగుమతులు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: