సూర్యఘర్ పేదలకు వరం
నూజివీడు : రాష్ట్రంలో రానున్న రోజులలో విద్యుత్ చార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులోని క్యాంపు కార్యా లయంలో ఆదివారం పత్రికా విలేఖరుల సమావేశంలో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చార్జీలు పెంచబోమనే మాటకు తాము కట్టుబడి ఉన్నామని, అంతేకాక ప్రస్తుతం ఉన్నా విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు సిఎం చర్యలు తీకుంటున్నారన్నారు. ప్రజలకు మంచి చేసే తమ ప్రభుత్వం ట్రూ డౌన్తో రూ.4789 కోట్ల మేర విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా తగ్గించిందన్నారు. గత నెలకొల్పి రూ.2.49లకే విద్యు త్ అందిస్తామని కంపెనీలు ముందుకు వచ్చినా, కక్షపూరిత ధోరణితో గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.
Read also: Chandrababu Naidu: నీళ్ల లెక్కలు త్వరలో అన్నీ బయటపెడతా!

The government is working on reducing electricity charges
రూ.5.19, రూ.5.50ల అధిక రేట్లకు ఓపెన్ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు అగ్రిమెంట్ కుదుర్చుకుని, విద్యుత్ భారాన్ని ప్రజల నెత్తిన వేశారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా ట్రూ అప్ పేరుతో రూ.4,789 కోట్లు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడిందన్నారు. ఆ భారం ప్రజలపై వేయకుండా తమ ప్రభుత్వమే భరిస్తుందని, తమ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సుపరిపాలనకు ఇది నిదర్శనమన్నారు. ఒక విజనరీ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం లో ప్రజలకు సుపరిపాలన ఫలాలు అందుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి బాటలో నిలిపేందుకు విదేశాల నుండి లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఒప్పించి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని, వీటి ద్వారా లక్షలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు.
సూర్య ఘర్ యోజన పధకం కింద పేదలకు సోలార్ విద్యుత్ యూనిట్లు అందిస్తున్నామన్నారు. రైతులు పొలాల్లో సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ప్రోత్సాహం అందిస్తామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటు న్నామని, గత ప్రభుత్వం పంచాయతీల నిధులు పంచాయతీ సిబ్బందికి తెలియకుండానే మాయం చేసిందన్నారు. ఉపముఖ్య మంత్రి పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని, రాష్ట్రంలోని గ్రామాలలో 5 వేల కిలోమీటర్ల మేర రోడ్లు, ప్రతీ ఇంటికీ త్రాగునీటి పైప్ కనెక్షన్ అందిస్తున్నారని మంత్రి పార్థసారథి వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: