हिन्दी | Epaper
పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

News Telugu: AP Digital Governance: అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Rajitha
News Telugu: AP Digital Governance: అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

విజయవాడ : జిల్లాల్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఇకపై ప్రతి ఫైలు కూడా ఇ-ఫైలుగానే నిర్వహించాలని, జనవరి 15వ తేదీ తర్వాత ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్లోనే అందించ నున్నామని ఈ దిశగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని సూచించారు. ఇ-ఆఫీసు, ఆర్టీజీ కార్యకలాపాలపైన ఆయన జిల్లా కలెక్టర్ల సదస్సులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. ప్రభుత్వంలో దాదాపుగా అన్ని ఫైళ్లు ఇ-ఫైలు రూపంలోనే నిర్వహిస్తున్నారని అయితే జిల్లాలో ఇప్పటికీ కొన్ని కార్యాలయాల్లో కొంతమంది ఫిజికల్ ఫైళ్లు నడుపుతున్నారని తెలిపారు. ఈ విధానానికి ఇక పూర్తీగా స్వస్తి పలకాలని ఇకపై అన్ని ఫైళ్లూ ఇ-ఫైళ్లుగానే నిర్వహించాలని సూచించారు. జనవరి 15వ తేదీ నుంచి ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలన్నీ కూడా ఆన్లైన్లోనే అందించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఆన్లైన్లో అందించే సేవల్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలందించడమే మన మొదటి ప్రాధాన్యం కావాలన్నారు.

Read also: AP tourism news : విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్.. 

AP Digital Governance

AP Digital Governance

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా

తమ పనుల కోసం ప్రజలెవ్వరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలూ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామన్నారు. మనమిత్రను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుని సులభంగా సేవలు పొందేలా చూడాలని చెప్పారు. మనమిత్రపై ప్రజల్లో అవగాహన కల్పించి దీని వినియోగం పెంచేలా జిల్లాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆయా శాఖల అధికారులు ఈ అవగాహన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని ఆయా శాఖలకు సంబంధించి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎంత సులభంగా పొందవచ్చో ప్రజలకు వివరించాలన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై తమ తమ జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల సర్టిఫికెట్లు సులభంగా పొందవచ్చని, ప్రభుత్వానికి పన్నులు, బిల్లుల చెల్లింపు వరకు అన్నీ సులభంగా చేయొచ్చన్నారు.

డిజీ వెరిఫై..

ప్రభుత్వం ప్రత్యేకించి డిజీ వెరిఫై అందుబాటులోకి తెచ్చిందని దీన్ని అన్ని శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిజీ వెరిఫై ద్వారా ఇకపై సర్టిఫికెట్లను ఫిజికల్గా తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని భాస్కర్ కాటంనేని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన ప్రతి సర్టిఫికెట్ను బ్లాక్ చైన్ టెక్నాలజీతో తనిఖీ చేసి డిజీవెరిఫైలో పెట్టామన్నారు. ప్రజలైనా, అభ్యర్థులైన అప్లోడు చేసిన తమ సర్టిఫికెట్లను అధికారులు అప్పటికప్పుడే డిజీవెరిఫైలో బ్లాక్ చైన్ టెక్నాజలీలో సులభంగా తనిఖీ చేసుకోవచ్చని చెప్పారు. ప్రధానంగా ఏపీపీఎస్సీ, సంక్షేమ శాఖలు దీన్ని విస్తృతంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ప్రతి సారీ సర్టిఫికెట్ల కోసం అభ్యర్థులు, ప్రజలు ఏం ఆర్వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని పాత మార్కుల జాబితాలను కూడా ఇప్పుడు స్కాన్ చేసి డిజిటలీకరణ చేస్తున్నామని చెప్పారు.

జిల్లా కలెక్టర్లు నిరంతరం పరిశీలించాలని

సిద్దంగా ఉందని, ప్రభుత్వంలో వివిధ శాఖలు తను ఆర్టీజీఎస్లోలో పనితీరు మరింత సులభతరం చేసుకోవడానికి వీలుగా ప్రస్తుతం తాము 98 యూస్ కేసెస్ రూపొందించే ప్రయత్నం జరుగుతోందన్నారు. జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో రోజువారి పాలనకు సంబంధించి పలు సమస్యలను ఎదుర్కొంటుంటారని క్షేత్రస్థాయిలో రోజువారీ పాలన మరింత సులభతరం చేసేలా ఎలాంటి యూస్ కేసెస్ అవసరమని భావిస్తున్నారో ఆర్టీజీఎస్కు తెలియజేస్తే తాము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అలాగే అవేర్ను ఇప్పుడు రియల్ టైమ్లో లైవ్లో ఉంచామని తెలిపారు. దీన్ని జిల్లా కలెక్టర్లు నిరంతరం పరిశీలించాలని, తమ తమ జిల్లాలో భూగర్భజలాల నుంచి నీటి లభ్యత, వాతావరణం మార్పులు, సాయిల్ హెల్త్, తదితర అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తదనుగుణంగా వ్యవహరించాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870