శ్రీకాళహస్తి : రాష్ట్రంలో(AP) ఎక్కడాలేని విధంగా శ్రీకాళహస్తి(Srikalahasti) పట్టణంలో ఏడుగంగమ్మల జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడది అధికారులు నిబంధనలతో కట్టడి చేసినప్పటికి ఈ ఏడాది జనం ఒక్కసారిగా సునామీలా కదలి వచ్చారు. జాతరను సంప్రదాయ బద్దంగా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే జాతరను నిర్వాహకుల పోటీలు పడి చేయడం గమనించదగ్గ విషయం. ఏడుగంగమ్మల జాతరలో భక్తులు వెయ్యికళ్ళ దుత్తలతో తమ మొక్కులు తీర్చుకున్నారు. పలువురు మహిళాభక్తులు వేపాకు ధరించి నెత్తిన దుత్తలు పెట్టుకుని అందులో దీపాలు వెలిగించి గంగమ్మ చుట్టు ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారి ముందు పగులగొట్టడం ఆనవాయితీ. పలువురు గంగమ్మమాలధారణ ధరించిన భక్తులు కూడా వేయికళ్ల దుత్తలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈఏడాది నిర్వాహకులు కొంత సమయపాలనను పాటించారు.
Read also: నకిలీ మద్యం కేసులో గోవా వ్యాపారి బాలాజీకే అధిక చెల్లింపులు

శ్రీకాళహస్తి ఏడుగంగమ్మల జాతరలో ప్రత్యేక అలంకారాలు
ప్రతి ఏడాది(AP) గంగమ్మకు జంతుబలులు వందలాది కనబడేది రోడ్లు రక్త సిక్తమయ్యేవి. కానీ ఈఏడాది ఆ వాతావణం కనబడలేదు. కారణం అమ్మవారి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఏకాంతంగా జరిగింది.. దారి వెంబడి అడుగడుగునా ఎవరి -స్థోమతను బట్టి వారు మొక్కులు చెల్లించుకున్నారు. గంగమ్మల ముందు కుంభంవేసి, పిండిదీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న ఏడుగంగమ్మల -జాతర సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేకాలంకారాలు, సప్పరాలను రూపొందించారు. వివిధ అమ్మవార్ల అలంకారాలను పరిశీలిస్తే పెండ్లిమండపం -వద్ద ప్రతిష్టించు అమ్మవారు పొన్నాలమ్మకు కాత్యాయిని దేవి అలంకారం రాజరాజేశ్వరి విశ్వరూప ప్రభఅశ్వాలు, మయూర వాహనాలు, కొండమిట్ట (బేరివారి మండపం వద్ద) ముత్యాలమ్మకు శ్రీ కనకదుర్గాదేవి అలంకారం పుష్ప ప్రభ సింహావాహనం, జయరామారావువీధిలోని అమ్మవారికి త్రిశూల మహాశక్తి ప్రభ భవాని అలంకారం హంసల వాహనం, గోపురం వద్ద ఏర్పాట్లు చేసిన సన్నిధివీధి అమ్మవారికి శ్రీరేణుకాదేవి అలంకారం సింహావాహనం, తేరువీధి బాపన వీధి నల్ల గంగమ్మకు -మహాకాళికా దేవి అలంకారం ముత్యాల మండపం, సింహాగర్జన వాహనం గాంధీవీధి గంగమ్మకు శ్రీజ్వాలా త్రిపుర సుందరి అలంకారం, మయూర వాహన ప్రభ, కొత్తపేట గంగమ్మకు భువనేశ్వరిదేవికి -శీతలాంబదేవి అలంకారం నాగేంద్ర వాహనంపై అమ్మవారి ప్రతిష్టతో తీర్చి దిద్దుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: