తిరుపతి హెల్త్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. నారాయణ మెట్ట ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు సాగునీరు, త్రాగునీరు లేక మిట్ట ప్రాంతాల ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. నారాయణ అన్నారు. ప్రాజెక్టులు ప్రారంభించి 40 సంవత్సరాలు గడుస్తున్న కొందరు చేసిన పరిపాలన వ్యవహార శైలితో ఇంకా వెనకబాటుతనాన్ని చూస్తున్నామన్నారు. పరిశ్రమలు లేక ఉద్యోగ అవకాశాలు లేక యువత బయట దేశాలకు ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ… అభివృద్ధి చెందిన ప్రాంతాలకి సాగునీరు, పరిశ్రమలు మెట్రో రైల్వే లైన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, వైద్య ఆరోగ్య కేంద్రాలు లక్షల కోట్లు ఖర్చు చేయడం దుర్మార్గమన్నారు.
Read also: Metro Expansion: హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యం

Development of backward areas is our goal: B. Narayana
2 కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు ఇవ్వచ్చని
కూటమి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం మెట్ట ప్రాంతాల సాగునీటి ప్రాజెక్టులు అయిన హంద్రీనీవా, తెలుగు గంగ, ఎస్ఆర్బిసి పూర్తి చేస్తే 20.76 లక్షల ఎకరాలకు సాగునీరు, 2 కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు ఇవ్వచ్చని, రాబోయే బడ్జెట్లో సంవత్సరానికి 10వేల కోట్లు చొప్పున 3 సంవత్సరాలలో మెట్ట ప్రాంతాల సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని అభివృద్ధి వేదిక డిమాండ్ చేస్తున్నదన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని పార్టీలు పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కేంద్రముతో కుమ్మక్కై ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు.
మేధావులు, ప్రజలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన నాయకులను కలుపుకొని అందరి సహకారంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎంవి శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు కే కుమార్ రెడ్డి, ఆర్ఎస్యు అఖిల భారత అధ్యక్షులు వి.రవిశంకర్ రెడ్డి, ఏఐసీసీ కోఆర్డినేటర్ ఎస్ ఏ సత్తార్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు సగిలి గుర్రప్ప, వ్యాన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవి శివ, సిఆర్వి ప్రసాద్ రావు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు జయవర్ధన్, పిఎసు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: