నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి బలపడుతున్న దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముందస్తు జాగ్రత్తగా నెల్లూరు, (Nellore) చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను భూమిని తాకకపోయినప్పటికీ, తీరం పాటు ప్రయాణిస్తూ సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది చెన్నైకి దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉండగా, ఉత్తర–వాయువ్య దిశగా కదులుతోంది.
Read also: S.Kota: ఎస్.కోట ప్రజల్లో విలీనం అంశంపై ఆగ్రహం

AP Cyclone Dithwa
బలమైన ఈదురుగాలులు
తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి మంగళవారం వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తీరం వెంట గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రం తీవ్ర అలజడితో ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబరు, విశాఖ, మచిలీపట్నం, కాకినాడ సహా ఇతర పోర్టులకు రెండో నంబరు ప్రమాద సంకేతాలను కొనసాగించారు.
దిత్వా తుపాను ప్రస్తుతం ఎక్కడ ఉంది?
చెన్నైకి దక్షిణంగా సుమారు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు?
నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: