విజయవాడ : నిరుద్యోగులు, అమాయకులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి ఆ వివరాలను చట్ట విరుద్ధ లావాదేవీల కోసం వాటిని ఫిలిప్పీన్స్‌కు పంపిస్తున్న(AP) విజయవాడకు చెందిన ముఠాను సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. కరెంటు ఖాతా తెరిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. ఆ తర్వాత బ్యాంకు ఎకౌంట్లు సేకరిస్తున్నారు. ఈ ముఠాలోని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విజయవాడకు చెందిన పేరపోగు దేవదాసు ఉద్యోగం చేసి, ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గతేడాది అతని ఇంటి పక్కన ఉండే కృష్ణారెడ్డి (ఏ3) దేవదాసును కలిసి బ్యాంకులో కరెంటు ఖాతాను తెరిచి, ఆన్లైన్లో షేర్ చేస్తే డబ్బులిస్తారని ఆశ చూపించాడు. రూ.10,000 వస్తాయన్న ఆశతో కృష్ణారెడ్డితో కలిసి భవానీపురంలోని సిటీ యూనియన్ బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ కరెంటు ఖాతా తెరిచి, కిట్‌ను కృష్ణారెడ్డికి ఇచ్చాడు.
తర్వాత బాధితుడి ఫోన్‌పే ఖాతాలకు రూ.7,000 జమ చేశారు. ఇటీవల దేవదాసు తన ఖాతాను పరిశీలించగా రూ.2 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించాడు. భయపడి వెంటనే విజయవాడలోని సైబర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సూర్య, కృష్ణారెడ్డి, అతని భార్య సౌభాగ్యలక్షి ్మలను పోలీసులు అరెస్టు చేశారు. కీలక నిందితురాలు పార్వతి ఇంకా అరెస్టు కావాల్సి ఉంది. ఈ ముఠా మొత్తం 199 ఖాతాలు తెరిపించగా వాటిలో 36 ఖాతాల నుంచి 56 మోసాలకు సంబంధించి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
Read also: Andhra Pradesh: నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

ఫిలిప్పీన్స్ ఖాతాలు: కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి
తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగు చూశాయి. అతని భార్య సౌభాగ్యలక్ష్మి (ఏ4) కూడా అమాయకులతో బ్యాంకు ఖాతాలు తెరిపించేదని తేలింది. వీరిపై (AP) విజయవాడ (Vijayawada) నగరానికి చెందిన సూర్య శ్రీనివాస మణికంఠ ఆలియాస్ సూర్య (ఏ1) పర్యవేక్షించాడు. ఈ దంపతులు సేకరించిన ఖాతాలను మణికంఠకు అందించేవారు. అతను వాటిని చట్టవిరుద్ధ లావాదేవీల కోసం పార్వతి (ఏ2)కి ఇచ్చేవాడు. ఆమె తిరిగి వీటిని ఫిలిప్పీన్స్‌లో ఉన్న మరో మహిళకు అందించేది. అక్కడి నుంచి ఈ ఖాతాలను బెట్టింగ్‌లు, సైబర్ నేరాలల్లో నగదు బదిలీలకు ఉపయోగించేవారు. ప్రతి ఖాతాకు వీరికి రూ.30,000 కమీషన్ అందేది. ఈ డబ్బును అన్ని దశల్లో పంచుకునే వారని దర్యాప్తులో తేలింది. ఈ ముఠా మొత్తం 199 ఖాతాలు తెరిపించగా. వాటిలో 36 ఖాతాల ద్వారా 56 లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇవి ఏపీతో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్, జమ్మూ కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో జరిగిన మోసాలకు ఈ ఖాతాలను ఉపయోగించారు.
కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్
ప్రధాన నిందితుడు సూర్యను 2023లోనూ అద్దె ఖాతాల కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పోలీసులు అరెస్టు చేశారు. 9 నెలలు జైలులో గడిపాడు. బయటకు వచ్చాక టెలిగ్రామ్ ద్వారా అద్దె ఖాతాలు సేకరిస్తూ దందా కొనసాగిస్తున్నట్లు తేలింది. పోలీసులు సూర్యతో పాటు కృష్ణారెడ్డి, అతని భార్య సౌభాగ్యలక్షి స్త్రీని అరెస్టు చేశారు. వీరి నుంచి 2 కార్లు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూర్య తన కారుపై రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకున్నారు. దీని పైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలక నిందితురాలు పార్వతి సహా పలువురి అరెస్టుకు ప్రయత్నిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: