చదువు, ఉద్యోగం అవసరమే. బతికేందుకు రెండు ముఖ్యమే కానీ ప్రాణాలను తీసుకునేంత ముఖ్యమైతే కాదు. ఎందుకంటే బతికేందుకు ఏపని అయినా చేసుకుని జీవించవచ్చు. మనకంటే కూలీపనులు చేసుకునేవారు ఎంతో దఢంగా జీవిస్తున్నారు. బతికేందుకు వందదార్లు ఉన్నాయి. కానీ ఓ యువతి మాత్రం తనకు అమెరికా వీసా (Visa) రావడం లేదని ఏకంగా ఆత్మహత్యకు పాల్పడింది. చదువులో రాణించలేకపోతున్నామని, ఇంట్లో వారు తిట్టారని, అడిగింది కొనివ్వలేదని ఇలా చిన్నచిన్ని కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది.
Read Also: Hyderabad Accident: ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

ఏడాదిగా వీసా కోసం నిరీక్షణ
గుంటూరుకు (AP Crime) చెందిన డా॥ రోహిణి హైదరాబాద్ లో ఉంటున్నారు. గత ఏడాది నుంచి ఆమె అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆమెకు జీ1 వీసా (G1 visa) రాలేదు. దీంతో రోహిణి తీవ్ర మనస్తాపం చెందారు. తన నివాసంలో అధికవమోతాదులో నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అమెరికా వెళ్లాలనే ఆమె కలలు నెరవేరలేదని అందుకే ఈ కఠిన చర్య తీసుకుందని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. రోహిణి ఉన్నతమైన విద్యను అభ్యసించారు.
ఇండియాలోనే చక్కగా ఉద్యోగం చేసుకుంటూ జీవించవచ్చు. అలాకాకుండా అమెరికా దేశంలోనే ఉద్యోగం చేయాలని తన జీవితాశయంతో ప్రాణాలను తీసుకున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చారు. వలసదారులపై ట్రంప్ (Trump) కఠిన నిబంధనలు తెస్తున్నారు. ట్రంప్ ఉద్దేశం భారీగా విదేశీయుల రాకను అరికట్టాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అమెరికాపై అనేకులు తమ ఆశల్ని వదిలేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ దేశాలకు ప్రయత్నిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: