ఆంధ్రప్రదేశ్ (AP Crime) లోని, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి దగ్గర ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండు బోగీలు కాలిపోగా.. ఒకరు సజీవ దహనం అయ్యారు. మృతుడ్ని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70)గా గుర్తించారు. మృతుడి బ్యాగులో భారీగా నగదు, బంగారం ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు.
Read Also: YCP: చంద్రబాబును దింపి గద్దెనెక్కేందుకు లోకేశ్ ఆరాటం

ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా
రైల్వే పోలీసులు చంద్రశేఖర్ కుటుంబసభ్యుల సమక్షంలో ఆ బ్యాగును తెరిచి చూడగా, అందులో రూ.5.80లక్షల నగదు, బంగారం ఉన్నట్లు నిర్ధారించారు. అయితే, దురదృష్టవశాత్తు చాలా వరకు నోట్లకట్టలు మంటల్లో కాలిపోయాయి. ఈ రైలు ప్రమాద ఘటనతో రైలు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: