విజయవాడ : నకిలీ మద్యం కేసు వ్యవహారంలో గోవా వ్యాపారి బాలాజీకే అధిక చెల్లింపులు జరిగినట్లు సిట్, ఎక్సైజ్ దర్యాప్తులో నివేదికలో స్పష్టం చేఎసింది.. నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ సరఫరాదారుడు అతనేనని అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుల అకౌంట్లో భారీగా లావాదేవీలు జరిగినట్లు అధికారుల స్పష్టం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, ములకల చెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో సహ నిందితుల మధ్య పెద్దఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఒకరి నుంచి మరొకరికి బ్యాంకు అకౌంట్లు, యూపీఐ ఐడీలద్వారా నగదుబదిలీ అయినట్లు సిట్, ఎక్సైజ్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. నిందితులకు సంబంధించిన కొన్నేళ్ల బ్యాంకు స్టేట్మెంట్లను అధికారులు వడపోశారు. నకిలీ మద్యం తయారీకి ముడి సరకు, ఇతర వస్తువుల కోసం వీరు అధిక మొత్తం వెచ్చించినట్లు వెల్లడైంది. గోవాలో పరిచయమైన బాలాజీద్వారా రెక్టిఫైడ్ స్పిరిట్ ను ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు కొనుగోలు చేసినట్లు సిట్, ఎక్సైజ్ దర్యాప్తులో తేలింది.
Read also: Rajahmundry: 9 ఫ్లైట్‌లు యథావిధిగా: రాజమహేంద్రవరం విమానాశ్రయం డైరెక్టర్ ప్రకటన

highest payments were made to Goa businessman Balaji
1,200 లీటర్ల మేర నకిలీ మద్యం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అన్నమయ్య జిల్లాలోని నకిలీ మద్యం తయారీ కేంద్రాలకు బాలాజీ స్వయంగా వచ్చి స్పిరిట్, నీటిని 1:1/4 నిష్పత్తిలో కలిపేవాడని అధికారులు గుర్తించారు. తొలుత 2023 మార్చిలో ఇబ్రహీంపట్నంలో 1,200 లీటర్ల మేర నకిలీ మద్యం తయారు చేసినట్లు నిర్ధారించారు. సీసాల్లోకి నింపి కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, రాయల్ ల్యాన్సర్, ట్రాపికానా, ఆంధ్రా గోల్డ్, క్లాసిక్ బ్లూ విస్కీ వంటి బ్రాండ్ల పేర్లతో లేబుళ్లు అతికించి, విక్రయాలు సాగించాడు. లీటరుకు రూ.350 నుంచి రూ.450 చొప్పున బాలాజీ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అడ్వాన్స్ కింద జనార్దన్ రావు రూ.20 లక్షలు చెల్లించినట్లు బాలాజీతో పాటు అతని కుమారుడు సుదర్శన్ కు దాదాపు రూ.2.50 కోట్ల వరకు ముట్టినట్లు తేలింది. ఈ మొత్తాన్ని పలుమార్లు ములకలచెరువులో అందజేసినట్లు అధికారులు గుర్తించారు. అద్దేపల్లి సోదరులకు చెందిన ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: