ఒడిశాకు ప్రత్యేక పోలీసు బృందం
తిరుపతి : తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం విద్యార్థినిపై అసోసియేట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై (Sexual harassment) హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, విద్యార్థిని ఫిర్యాదు, తదుపరి పోలీసు కేసు నమోదు విషయాలను తిరుపతి జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడుని అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఉదయం ఆమె ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. లైంగిక వేధింపుల ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు.
Read also: AP Economy: ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్

Home Minister’s anger on Sanskrit University controversy
బాధిత విద్యార్థినితో మాట్లాడి
దీంతో ఓ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఒడిశాకు పంపి బాధిత విద్యార్థినితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఈ బృందం వచ్చిన తరువాత జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో వేధింపులకు గురిచేసిన అసోసియేట్ ప్రొఫెసర్ పై చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. ప్రాధమిక దర్యాప్తులో బాగంగా సాక్ష్యాధారాలు, కీలక సమాచారం సేకరించాలని ఎస్పీని ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: