విజయవాడ : నకిలీ మద్యం కేసులో నలుగురు నిందితులను కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టుఆదేశాలు జారీ చేసింది. అబ్కారీ అధికారులు నిందితులను పదిరోజులు తమ కస్టడీకి పంపాలని కోర్టును అభ్యర్థించగా.. న్యాయస్థానం అంగీకరించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులు.. కట్టా రాజు, సయ్యజ్ హజీ, అంథా దాస్, మిథున్ దాస్ లను ఈ నెల 11 నుంచి 15 వరకు కస్టడీలోకి తీసుకోనున్నారు ఎక్సైజ్ అధికారులు. నకిలీ మద్యం (Alcoholic beverage) తయారీ, పంపిణీకి సంబంధించి లోతైన సమాచారాన్ని రాబట్టే దిశగా అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.
Read also: Parliament Winter Session : ఏపీకి ఎలాంటి బాకీ లేము – కేంద్రం క్లారిటీ

Fake liquor case
ఇప్పటికే పలువురు నిందితులు అరెస్ట్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ నకిలీ మద్యం కేసులో.. అన్నమయ్య జిల్లా సహా పలు ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు బయటపడటంతో ప్రభుత్వం దీనిపై విచారణకు సిట్ ను ఏర్పాటుచేసింది. ఈకేసులో ఇప్పటికే పలువురు నిందితులు అరెస్ట్ అయ్యారు. వారిలో జోగి రమేశ్, జోగిరాము సోదరులూఉన్నారు. తాజాగా.. మరో నలుగురు నిందితుల కస్టడీద్వారా ఈ కేసుపై మరింత లోతైన విచారణ జరిగితే కీలక అంశాలు బయటపడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: