కొత్తగా మొదలైన దాంపత్య జీవితం అనుకోని ప్రమాదంతో విషాదంగా ముగిసింది. రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న దంపతులు రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ హృదయవిదారక ఘటన గురువారం అర్ధరాత్రి వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
Read Also: HYD: భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం

రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్(AP Crime) పార్వతీపురం మన్యం జిల్లా రావుపల్లి గ్రామానికి చెందిన కోరాడ సింహాచలం (25) హైదరాబాద్‌లోని ఓ కెమికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలల క్రితం ఆయనకు అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని (19)తో వివాహం జరిగింది. వివాహానంతరం ఈ దంపతులు హైదరాబాద్ జగద్గిరిగుట్ట గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు.
విజయవాడలో(AP Crime) ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు గురువారం రాత్రి సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. రైలు రద్దీగా ఉండటంతో ఇద్దరూ తలుపు దగ్గర నిలబడ్డారు. వంగపల్లి స్టేషన్ దాటిన కొద్దిసేపటికే సమతుల్యత కోల్పోయి ప్రమాదవశాత్తూ ఇద్దరూ కిందపడి ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉదయం ట్రాక్‌మెన్‌లు మృతదేహాలను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: