ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) ఖాళీల భర్తీకి సంబంధించిన రెండు తాజా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజినీరింగ్ సంబంధిత విభాగాల్లో పలు పోస్టులను భర్తీ చేయనుంది. రాష్ట్ర రాజధాని అమరావతి (Capital Amaravati) లో జరుగుతున్న నిర్మాణ పనుల పర్యవేక్షణ, సాంకేతిక సహకారం అందించేందుకు ఈ నియామకాలు చేపట్టబడ్డాయి. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు సీఆర్‌డీఏ ప్రకటించింది.
ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం వందలాది ఇంజినీరింగ్ పోస్టు (Engineering post) లు భర్తీ చేయనున్నారు. అందులో:
- చీఫ్ ఇంజినీర్ పోస్టులు – 4
- సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులు – 8
- ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు – 15
- డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు – 25
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్/అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు – 50
- సీనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ పోస్టులు – 2
- జూనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ పోస్టులు – 4
మొత్తం మీద 100కి పైగా పోస్టులను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నట్లు స్పష్టమైంది.

ఈ పోస్టులన్నింటినీ ఒప్పంద పద్ధతిలో భర్తీ
అలాగే సీనియర్ ఎలక్ట్రికల్/ ఈఎల్‌యూ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ ఎలక్ట్రికల్/ఈఎలయూ ఎక్స్‌పర్ట్ పోస్టులు 6, సీనియర్ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ ప్లంబింగ్ ఎక్స్పర్ట్ పోస్టులు 6, సీనియర్ హెచ్‌వీఏసీ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ హెచ్వీఏసీ ఎక్స్‌పర్ట్ పోస్టులు 6 వరకు ఉన్నాయి. మొత్తం 132 వరకు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నింటినీ ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇతర సమాచారం కోసం ఏపీ సీఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్ లోని కెరీర్స్ విభాగంలో చెక్ చేసుకోవాలని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: