ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. శ్రీచక్ర నవావరణార్చన వంటి అత్యంత పవిత్రమైన పూజకు వినియోగించిన పాలలో పురుగులు కనిపించడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మవారి సన్నిధిలో నిర్వహించే పూజల్లో నాణ్యత, పరిశుభ్రతపై ఇప్పటికే ప్రశ్నలు వస్తున్న వేళ, ఈ ఘటన ఆలయ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా మారింది.
Read also: Sankranti: భోగి మంటలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు
Commotion at the Kanaka Durga temple
శుక్రవారం అమ్మవారి నూతన పూజా మండపంలో ఈ ఘటన జరగగా, శనివారం విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఆవుపాలు ఉపయోగించాల్సిన పూజలో పురుగులు ఉన్న టెట్రా ప్యాకెట్ పాలను వాడినట్లు సమాచారం. ఈ విషయం గుర్తించిన అర్చకులు వెంటనే పూజను నిలిపివేయగా, దాదాపు అరగంట పాటు నవావరణార్చన నిలిచిపోయింది. ఆలయ నిర్వహణలో నిర్లక్ష్యం ఉందని భక్తులు విమర్శలు చేస్తున్నారు. ఆలయంలో పవిత్రత, సంప్రదాయాలకు భంగం కలిగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: