ఆంధ్రప్రదేశ్ (AP) లో యువతకు ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. తాజాగా ‘సీఎం ఉపాధి కల్పన పథకం (CM Employment Generation Programme – CMEGP)’ పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా యువతకు స్వంత వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
Read Also: AP: బంగారాన్ని పోలీసులకి అప్పగించిన ఆటోడ్రైవర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం
సమాచారం ప్రకారం, ఈ స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఈ పథకం ద్వారా అవకాశాలు కల్పించాలన్నదే (AP) ప్రభుత్వ ఉద్దేశ్యం. గ్రామీణ స్థాయిలో స్వయం ఉపాధి పెంచి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న దిశగా ఈ యోజన రూపుదిద్దుకుంటోంది.
సీఎం ఉపాధి కల్పన పథకంలో సేవారంగం మరియు తయారీ రంగాలకు వేర్వేరు పరిమితులు నిర్ణయించారు. సేవారంగంలో రూ.2 లక్షల నుండి రూ.20 లక్షల వరకు, తయారీ రంగంలో రూ.10 లక్షల నుండి రూ.50 లక్షల వరకు రుణాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ రుణాలకు సబ్సిడీ సౌకర్యం కూడా కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: