
ఆంధ్రప్రదేశ్ (AP), విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం కీలక దశను విజయవంతంగా దాటింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన ట్రయల్ రన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలోనే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం విశేషం.
Read also: Mangalagiri Crime: బైక్‌పై వచ్చి ఇంటర్ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన దుండగులు
గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం విజయవంతం
ట్రయల్ రన్ సక్సెస్ పై సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎక్స్ వేదికగా ఆదివారం స్పందించారు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం విజయవంతంగా పూర్తయిందని, విమానయాన రంగంలో కొత్త మైలురాయి దాటామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు వల్ల ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తుందన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. జూన్ నుంచి వాణిజ్య విమాన కార్యకలాపాలతో ప్రజలకు సేవ చేయడానికి ఎయిర్‌పోర్టు సిద్ధంగా ఉంటుందన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: