हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

AP: అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్‌షాను కోరిన CM

Aanusha
AP: అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్‌షాను కోరిన CM

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో కీలక స్థాయి చర్చలు జరిపారు. ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా మొత్తం ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై విజ్ఞాపన పత్రాలను సమర్పిస్తూ కేంద్ర సహకారం కోరారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. APలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని శివరాజ్ సింగ్ చౌహా‌న్‌ను కోరారు. పోలవరం రెండో దశకు రూ.32 వేలకోట్లు అవసరమని జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు.

Read Also: AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల

AP: CM asks Amit Shah to give legal status to Amaravati
AP: CM asks Amit Shah to give legal status to Amaravati

జీరోల్యాండ్ ఫిల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వేస్ట్ మేనేజ్మెంట్, జీరో ల్యాండ్ ఫిల్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 కింద రూ. 276 కోట్ల ఖర్చుతో జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ కు కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. కేంద్ర వాటా కింద రూ. 105 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం కేంద్ర ఉక్కు శాఖా మంత్రి హెచ్ డీ కుమారస్వామితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించి ప్లాంట్ లాభాల బాట పట్టడంలో అందించిన సహకారానికి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870