ఆంధ్రప్రదేశ్‌లో(AP) పదో తరగతి (SSC) పరీక్షలకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను రాష్ట్ర ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రతి రోజూ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. వంద మార్కుల పరీక్షలు మధ్యాహ్నం 12:45 గంటల వరకు, 50 మార్కుల పరీక్షలు ఉదయం 11:30 గంటల వరకు కొనసాగుతాయి.
Read Also: Salaries: 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిందే..లేబర్ కోడ్ రూల్స్

అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకుని, పరీక్షా తేదీలకు(AP) అనుగుణంగా విద్యార్థులు సిద్ధమవ్వాలని సూచించారు. ఏవైనా తప్పు కాంబినేషన్ పేపర్లు రాసినట్లయితే బాధ్యత విద్యార్థులదేనని కూడా స్పష్టంచేశారు.
ఏపీ ఎస్‌ఎస్‌సీ 2025 పరీక్షల పూర్తి షెడ్యూల్
- మార్చి 16: ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18: సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 20: ఆంగ్లం
- మార్చి 23: గణితం
- మార్చి 25: ఫిజికల్ సైన్స్
- మార్చి 28: బయలాజికల్ సైన్స్
- మార్చి 30: సాంఘిక శాస్త్రం
అదనపు పరీక్షలు:
- మార్చి 31:
- కాంపోజిట్ కోర్సులకు ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్–2)
- OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1
- ఏప్రిల్ 1:
- OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2
- ఎస్‌ఎస్‌సీ వోకేషనల్ కోర్సుల థియరీ పరీక్షలు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: