దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ మస్టర్లను పూర్తిగా నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం (face recognition attendance) తీసుకురావాలని భావిస్తోంది. ఇవాళ ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లోని, (AP) మన్యం జిల్లాతో పాటు దేశంలోని మరో 2 జిల్లాల్లో అమలు చేయనుంది.
Read Also: CM Chandrababu: పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

దేశమంతటా ఈ విధానం అమలయ్యే ఛాన్స్ ఉంది
పని జరిగే ప్రాంతంలో 10 మీటర్ల పరిధిలో అటెండెన్స్ తీసుకుంటారు. 4 గంటల వ్యవధిలో 2 సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. రెండుమూడు నెలల తర్వాత దేశమంతటా ఈ విధానం అమలయ్యే ఛాన్స్ ఉంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికుల వేతనాల చెల్లింపు కూడా వేగవంతం కావచ్చు.
NREGA పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
NREGA 2005 సంవత్సరంలో పార్లమెంట్‌లో ఆమోదం పొంది, 2006 ఫిబ్రవరి 2న అధికారికంగా అమల్లోకి వచ్చింది.
NREGA కింద ఎన్ని రోజులు పని చేస్తారు?
ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక సంవత్సరంలో 100 రోజులు పని చేస్తారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: