విజయవాడ : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసారు.. వారికి 74 శాతం మాత్రమే అటెండెన్స్ ఉండడంపై మండిపడ్డారు. దీనిని ఎవ్వరూ అలసుగా తీసుకోవడానికి వీలు లేదన్నారు. గత ఏడాదికి సంబంధించి ప్రతి ఒక్కరి అటెండెన్స్ తన వద్ద ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఒక గంట రాలేదు, ఒక రోజు రాలేదు.. అత్యవసరం అయితే ఓకే అని తెలిపారు. ఫీల్డ్ విజిటి కి వెళ్లితే ఆ విషయాన్ని ముందుగా కార్యాలయ సిబ్బందికి తెలియజేయాల్సి ఉందన్నారు. అలవాటుగా విధులకు రాకుండా ఎవరు ఉంటున్నారో వారిని గైడ్ చేయాల్సి ఉందని చెప్పారు.
Read also: AP: అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూరప్, రష్యా మార్కెట్

Chandrababu expresses displeasure over the attendance
అప్పటికి వారు సెట్ కాకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని చెప్పారు. అలవాటుగా మారితే చూస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. వారి అటెండెన్స్ ను పర్యవేక్షించాలంటూ జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, నిధుల వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు సమీక్ష జరిపారు. కొన్ని శాఖలు, కొన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన కేంద్ర నిధులను జనవరి 15వ తేదీ నాటికి ఖర్చు పెట్టాలని అధికారులకు సిఎం సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: