ఈఈటీ ఏర్పాటును ప్రశంసించిన బీఈఈ
విజయవాడ : విశాఖపట్నంలో(AP) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (కో ఈఈటీ)ను ఏర్పాటు చేసినందుకు రాష్ట్రాన్ని బ్యూరో ఎనర్జీ ఆఫ్ ఎఫిషియన్సీ (బీఈఈ) ప్రశంసించింది. ఇది ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ఒక మైలురాయిగా నిలిచింది. దేశంలో 2070 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యంలో ఒక ప్రధాన ప్రోత్సాహకంగా బీఈఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎనర్జీ ఎఫిషియెన్సీ (ఈఈ) టెక్నాలజీల అమలును వేగవంతం చేయాలని కోరింది. ఇది దేశ వాతావరణ మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించ డంలో కీలకంగా మారనుంది. అదే సమయం లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టి స్తుంది. ఈ కార్యక్రమాలను అమలు చేయడం లో మిషన్మోడ్ విధానాన్ని అవలంబించాలని బీఈఈ అన్ని రాష్ట్రాల ఎన్డీఏలను కోరింది. ఈక్రమంలోనే అనేక రాష్ట్రాల చురుకైన విధానాలను బీఈఈ అభినందిస్తూ, విశాఖ పట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (కో ఈఈటీ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. పునరుత్పాదక ఇంధన స్వీక రణ, క్లీన్ టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రోత్స హించడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా బీఈఈ అభివర్ణించింది. పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. బీఈఈ, ఈఈఎస్ఎల్, విద్యుత్ మంత్రిత్వ శాఖ సాంకేతిక మరియు ఆర్థిక సహాయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ప్రమాణాలతో కూడిన 24/7 విద్యుత్ సరఫరాను అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. తద్వారా రాష్ట్రంలో గణనీయమైన పెట్టుబడు లను ఆకర్షించాలని నిశ్చయించు కుందని స్పష్టంచేశారు.
Read also: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు

గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం
సుస్థిర, కాలుష్య రహిత భవిష్యత్తుకు రాష్ట్రం(AP) అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అందులో భాగంగా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (నెడ్కాప్) ద్వారా విశాఖపట్నం సమీపంలో అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఏర్పాటు చేయడానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎనీఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకుందని విజయానంద్ వెల్లడించారు. సుమారు రూ.1.85 లక్షల కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (కో ఈఈటీ) ఏర్పాటు అనేది దేశ జాతీయ ఇంధన సామర్థం మరియు స్వచ్చ ఇంధన పరివర్తన లక్ష్యాలకు సంపూర్ణంగా అనుగుణంగా ఉండే ప్రశంసనీయమైన చొరవ అని బీఈఈ కార్యదర్శి మిలింద్ డియోర్ ప్రశంసించారు. అన్ని రాష్ట్రాల ఎన్డీఏలతో సమన్వయంతో ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడానికి బీఈఈ సమగ్ర రోడ్మ్యప్ను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఇది వాతావరణ మార్పు లను పరిష్కరించడంలో కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఇంధన సామర్థ్య పద్ధతులలో వెయ్యి మందికి పైగా నిపుణులు మరియు యుటిలిటీ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చినందుకు ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: