విజయవాడ : చట్ట సవరణకు చకచకా అడుగులు. ఇక అమరావతి (Amaravati) ఆంధ్రప్రదేశ్ కు అఫీషియల్ రాజధాని కానున్నది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాజధాని ఉండాలని అమరావతికి శంఖుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయి రాజధానిగా చేయాలని.. అమరావతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అని ఎపి పునర్వవస్థీకరణ చట్టంలోలేదు. ఈ నేపథ్యంలో అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో సవరణచేయడానికి ఇప్పటికే కేంద్రం న్యాయ శాఖ అమోదం తెలిపింది. ఈ సవరణ బిల్లు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొంది.. ఈ నెలలోనే పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం.
Read also: Cases of Scrub Typhus : ఏపీ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిగ్గర్ అనే పురుగు

Amaravati will soon receive official recognition
ఐదేళ్లుగా స్తంభించిపోయిన అమరావతి
పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అధికారికంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కాగా దాదాపు ఐదేళ్లుగా స్తంభించిపోయిన అమరావతి రాజధాని చట్టబద్ధత ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురావడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారికంగా చట్టబద్ధత కల్పించేందుకు ఎపి పునర్విభజన చట్టం2014లోని సెక్షన్ 5(2)ను సవరించాలి. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. న్యాయ శాఖ ఆమోదం పొంది.. పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి బిల్లు సిద్ధంగా ఉంది. కాగా, 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం రాజధానుల బిల్లు తీసుకొచ్చింది. అయితే దీన్ని ఇటీవల కూటమి ప్రభుత్వం రద్దు చేసి.. అమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక, ఏకైక రాజధానిగా గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
ప్రధాని నరేంద్ర మోడీతో పలుమార్లు చర్చించారు
ఈ విషయమై సిఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో పలుమార్లు చర్చించారు. దీంతో అమరావతి చట్టబద్ధత ప్రక్రియలో వేగం పుంజుకుంది. కాగా, ఎపిలో ప్రభుత్వం మారితే రాజధాని అమరావతి ఉంటుందా లేదా అమరావతి రైతులను ఇన్ని రోజులు వెంటాడింది. రాష్ట్ర ప్రజల్లో కూడా ఇదే సందేహం ఉంది. ఎట్టకేలకు రాజధాని చట్టబద్ధతకు అడుగులు పడుతున్న వేళ అమరావతి రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు రెండో దశ భూసేకరణ తప్పదని ఇటీవల సిఎం చంద్రబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పెట్టుబడులు, ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ వంటి వాటికి భూములు అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రెండో దశ భూసేకరణకు సంబంధించి చర్చించారు. 7 గ్రామాల పరిధిలో మరో 16,666 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: