हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

Latest News: AP Cabinet: 9,500 కోట్ల ప్రాజెక్టులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Saritha
Latest News: AP Cabinet: 9,500 కోట్ల ప్రాజెక్టులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

ఈ రోజు జరిగిన (AP Cabinet) కేబినెట్ భేటీలో రూ.9,500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో(Amaravati) లోక్‌భవన్, అసెంబ్లీ దర్బార్ హాలు నిర్మాణానికి ఓకే చెప్పింది. అమరావతి రాజధానిలో గవర్నర్ బంగ్లా, దర్బార్ హాల్, గెస్ట్ హౌస్ల నిర్మాణానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియకు అనుమతులు మంజూరయ్యాయి.

Read Also: ఏడుగంగమ్మల జాతరలో మొక్కులు తీర్చుకున్న భక్తులు

AP Cabinet
AP Cabinet The cabinet has given the green light to projects worth ₹9,500 crore.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

రాజధాని నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఇవి కీలక ముందడుగులుగా భావిస్తున్నారు. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు కేబినెట్ (AP Cabinet) పూర్తి ఆమోదం తెలిపింది. పారిశ్రామిక అభివృద్ధికి ఇది పెద్ద ఊతమివ్వనుంది. కుప్పం నియోజకవర్గంలో పాలర్ నదిపై నాలుగు చెక్ డ్యామ్ల నిర్మాణానికి సంబంధించి సవరించిన అనుమతులకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు.ఉపాధ్యాయ విభాగానికి సంబంధించిన ఒక ముఖ్య నిర్ణయం ప్రకారం, 417 మంది భాషా పండిట్లను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో స్కూళ్లలో భాషా బోధన నాణ్యత మరింత మెరుగుపడనున్నదని విద్యాశాఖ భావిస్తోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక వసతులు, నీటి వనరులు, విద్య తదితర రంగాల్లో వేగవంతమైన పురోగతికి దోహదం చేయనున్నాయి.గవర్నర్ ఆఫీస్, స్టాఫ్ క్వార్టర్స్, అతిథిగృహాల నిర్మాణానికి అంగీకారం లభించింది. 26 సంస్థలకు సంబంధించిన రూ.20 వేల కోట్ల పెట్టుబడులను క్యాబినెట్ ఆమోదించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870