సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ఈ భేటీ (AP Cabinet) లో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ సహా పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రధానంగా, అమరావతి నిర్మాణ పనుల కోసం నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్‌డీఏకు అనుమతిని ఇవ్వనున్నారు.అలాగే, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఏస్ఐపీబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ (AP Cabinet) ఆమోదం తెలపనుంది.
Read Also: Vande Bharat Express : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నరసాపురం వరకు వందేభారత్ ఎక్స్ ప్రెస్

భూ కేటాయింపులపై కూడా కేబినెట్ నిర్ణయం
దీని ద్వారా రాష్ట్రంలోకి రూ. 20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సుమారు 56 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపనున్నారు. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.గవర్నర్ నివాసంగా కొత్తగా లోక్‌భవన్ నిర్మాణానికి టెండర్లు, జుడీషియల్ అకాడమీకి పరిపాలన అనుమతులు ఇవ్వనుంది. అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలపైనా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: