ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) ఈ నెల 19వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ క్యాబినెట్ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అమరావతి రాజధాని నిర్మాణం పనులు
ఈ సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణం పనుల వేగవంతీకరణపై ప్రధానంగా చర్చించనున్నారు. పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరగనుంది. అలాగే పరిశ్రమలు మరియు ఐటీ సంస్థలకు అవసరమైన స్థలాల కేటాయింపు, పెట్టుబడుల ప్రోత్సాహంపై కూడా సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేలా ఆకర్షణీయ విధానాలు రూపొందించాలన్న ఆలోచన ఉందని సమాచారం.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు
ఇతర ప్రజా ప్రయోజన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసే విషయాన్ని క్యాబినెట్‌లో అంగీకరించే అవకాశం ఉంది. అన్నదాతా సుఖీభవ పథకాన్ని PM కిసాన్ పథకంతో అనుసంధానించే అంశం, రైతుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చర్చలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సమావేశం ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని భావిస్తున్నారు.
Read Also : Phone Tapping Case : రేపు ఇండియాకు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు