తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాద ఘటనలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, (AP Bus Accident) తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జిపై బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఈ బస్సులో సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో.. అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Read also: Minister Kollu Ravindra: గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు

అదుపులోకి మంటలు
ఈ ఘటనలో సుమారు రూ.80 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్నప్పుడు బస్సు సెల్ఫ్ మోటార్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపివేశారు.. ప్రయాణికుల్ని అలర్ట్ చేశారు. ఆ వెంటనే బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు వచ్చేశారు.
సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు చాకచక్యంగా మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికుల కోసం మరో బస్సును ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు తరలించారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంటల కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: