విజయవాడ : ఎన్టీఆర్ జిల్లాలో బార్ల కేటాయింపు తొలి దశ ముగిసింది. ఇటీవల నిర్వహించిన డ్రాలో అధికారులు మొత్తం 130 బార్లకు గాను 62 బార్లను కేటాయించారు. అధిక ఫీజులు, మద్యం దుకాణాలతో పోటీ కారణంగా తీసుకునేందుకు చాలా మంది వెనకడుగు వేశారు. కేవలం 62 బార్ల మాత్రమే లాటరీ ద్వారా డ్రా తీశారు. మద్యం(AP BAR) వ్యాపారులు ఒకరితో ఒకరు చేతులు కలిపి సిండికేట్ అయ్యారు. దాంతో అనుకున్నంతగా బార్ లైసెన్స్ లాటరీ ప్రక్రియకు అనుకున్నంత స్పందన రాలేదు.
గవర్నర్పేట కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డులోని ఒక హోటల్లో బార్ల(BAR) మేనేజర్లు గతవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయడం లాభదాయకం కాదని వారు అంగీకరించారు. దీని కారణంగా 57 బార్లకు ఒక్కొక్కరే నాలుగేసి దరఖాస్తులు వేసి ఏకగ్రీవంగా పొందారు. అలాగే 5 బార్లకు మాత్రమే లాటరీ తీసి కేటాయించారు.
బార్లను పొందిన మేనేజర్లు వెంటనే ప్రాథమిక రుసుములు చెల్లించాల్సి ఉంది. ఆదివారంతో గడువు ముగుస్తుండడంతో చాలా మంది వెంటనే డబ్బులు చెల్లించారు. అయితే 62 బార్లకు గాను 60 మంది ఒక్కొక్కరూ రూ.33 లక్షలు వరకు ప్రభుత్వానికి చెల్లించారు. బార్లు పొందిన వారు రూ.30 లక్షలు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. దీనికి ఇంకా 15 రోజులు మాత్రమే గడువు ఉండడంతో వాటిని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఎన్టీఆర్ జిల్లాలో(NTR district) 55 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. వీటికి మరోసారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ బార్లకు దరఖాస్తులు రాకపోవడంపై అధికారులు దృష్టి సారించారు. గత నెలాఖరులో నిర్వహించిన బార్ల కేటాయింపులో ఒక బార్కు రెండు మాత్రమే అప్లికేషన్లు రాగా ఒకే ఒక దరఖాస్తు వచ్చిన బార్లు 12 ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటికి లాటరీ తీయలేదు. వీటి కోసం దరఖాస్తుదారులకు మరికొంత గడువు ఇచ్చారు.
రెండు దరఖాస్తులే వచ్చిన బార్కు(AP BAR) మరో రెండు వచ్చాయి. దీంతో దీన్ని కేటాయించేందుకు మార్గం సుగమం అయింది. ఒకే దరఖాస్తు వచ్చిన మూడు బార్లకు కూడా నాలుగేసి దరఖాస్తులు రావడంతో వాటిని కూడా కేటాయిస్తారు. మిగిలిన 9 మందికి కూడా దరఖాస్తులు వస్తే వాటన్నింటినీ కేటాయిస్తామని అధికారులు ప్రకటించారు.
Read Hindi news: Hindi.vaartha.com
Read Also: